అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్న వ్యక్తికి కడుపు నిండా అన్నంపెట్టడం కంటే గొప్ప పుణ్యం లేదు. ఈ మహోన్నత సేవను అందిపుచ్చుకుని, దాతల సహకారంతో గత 2015 రోజులుగా పేదలకు అన్నదాన సేవలు కొనసాగుతున్నాయి.
మై వేములవాడ అన్నదాన సేవా ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం స్థానిక టీటీడీ ధర్మశాల వద్ద 50 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నదాన శాశ్వత సభ్యులుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు, స్నేహాలత, ప్రతాప స్వప్న, సంపత్, నగుబోతు రవీందర్, జ్యోతి, గణాచారి మఠం శైలజ, సాంబశివు, దేవరాజు ఉమ, బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత, వారి కొడుకులు కోడళ్లు ప్రజ్ఞ, శరత్చంద్ర, శిరీష, సాయిచంద్ర, శర్వాణి, రవిచంద్ర (హైదరాబాద్ వాస్తవ్యులు), చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ పాల్గొన్నారు.
పురాణాల ప్రకారం అన్నదానం ప్రాముఖ్యత
పేదలకు అన్నదానం చేస్తే ఆయువు, బలం, తేజస్సు, కీర్తి పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇతర కార్యక్రమాలకు పేదలకు అన్నార్తులకు మీరు వేములవాడ గుడి వద్ద ఒకరోజు అన్నదానం చేయాలనుకుంటున్నారా
ఒక్కరోజు అన్నదానం చేయాలనుకునే దాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్టు నంబరు 9246939388కు సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు. నేటి కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్, ప్రతాప నటరాజు, తమిశెట్టి రాధాకృష్ణ, గాజర్ల రాజు, చందు, ఉడుతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.











