నిర్మల్ జిల్లా మండలంలోని చాత గ్రామంలో ముదిరాజుల ముద్దుబిడ్డ పండుగల సాయన్న గారి 174వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ నాయకుడు పూజారి లక్ష్మణ్ మాట్లాడుతూ, పండుగల సాయన్న గారు చేసిన త్యాగాలు, సమాజం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు గైనం శ్రీనివాస్, గైనం పెద్దన్న, సున్నపు నర్సింహులు, బోయిడి భూమన్న, బింగి హన్మండ్లు, గైనం విఠల్, కట్ట సుభాష్, రవి, గంగాధర్, ఎలిగ భోజన్న, క్రాంతి, చిన్న సాయిలు, రాజుతో పాటు పలువురు యువకులు పాల్గొన్నారు.












