Nirmal/Lokeshwaram (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 11
అబ్దుల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా, తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్తతో పాటు ఇతర వ్యర్థాలను వేర్వేరుగా నిల్వ చేయడానికి అవసరమైన డబ్బాలను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, డబ్బాల్లో వేయడం, చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా గ్రామపంచాయతీ సిబ్బందికి అందించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
*అబ్దుల్లాపూర్లో చెత్త డబ్బాల పంపిణీ* *తడి, పొడి చెత్తపై గ్రామస్తులకు అవగాహన* లోకేశ్వరం మండల్ ( 2026 అబ్దుల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చే చర్యల్లో భాగంగా తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్తతో పాటు ఇతర వ్యర్థాలను వేర్వేరుగా నిల్వ చేసేందుకు అవసరమైన డబ్బాలను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, డబ్బాల్లో వేయడం, చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా గ్రామపంచాయతీ సిబ్బందికి అందించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. తడి చెత్తలో ఆహార పదార్థాల అవశేషాలు, కూరగాయలు, పండ్ల వ్యర్థాలు వంటి కుళ్లిపోయే వ్యర్థాలు ఉంటాయని, పొడి చెత్తలో కాగితాలు, ప్లాస్టిక్, గాజు, లోహం వంటి పొడి వ్యర్థాలు ఉంటాయని వివరించారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను తడి, పొడి, శానిటరీ వ్యర్థాలుగా వేరు చేసి అందించడం ద్వారా గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచవచ్చని అధికారులు సూచించారు. గ్రామస్తులు ఈ కార్యక్రమానికి సహకరించి పరిసరాల పరిశుభ్రతను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దడిగ జయలలిత, ఉప సర్పంచ్ సాయినాథ్, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, వార్డు సభ్యులు శ్రీకాంత్, లింగారెడ్డి, సాయినాథ్, సుదర్శన్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.












