నిర్మల్, 8 September
ప్రైవేట్ పాఠశాల బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించరాదని బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం () డిమాండ్ చేసింది. ఈ మేరకు నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో ఆర్టీఓ సిబ్బందికి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ చాకటి ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల బస్సుల్లో 30 నుంచి 40 మంది కంటే అధికంగా విద్యార్థులను ఎక్కిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. అధిక సంఖ్యలో విద్యార్థులను తరలించడం వల్ల అదుపుతప్పి కిందపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాల బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించకుండా ఆర్టీఓ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్సు నుంచి కిందపడి విద్యార్థులకు ప్రమాదం జరిగితే సంబంధిత ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలనే బాధ్యులను చేయాలని కోరారు.