కుంటాల, 7 September
మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ను తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ మార్పునకు గాను 9 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు.
లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం 9 కోట్ల రూపాయల నిధులు మోడల్ స్కూల్ ను అప్డేట్ చేస్తూ పబ్లిక్ స్కూల్ గా మార్పు వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ను అప్ గ్రేడ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా మార్చి ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగిందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు. ప్రభుత్వం జీవో విడుదల చేస్తూ పబ్లిక్ స్కూల్ మార్పు కోసం 9 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ నిధులతో అదనపు తరగతుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, ఇతరాత్ర సౌకర్యాలను మెరుగుపరచనున్నట్లు చెప్పారు. విద్యార్థులు ప్రైమరీ నుండి ఇంటర్ వరకు ఇక్కడే చదువుకోవచ్చని పబ్లిక్ స్కూల్ ఏర్పాటు మూలంగా విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుతాయి అన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.











