బోధన్, 8 September
మండలంలోని బిక్నెల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజేవీపీ) నాయకులు సందర్శించారు. పాఠశాలలోని విద్యా సౌకర్యాలు, మౌలిక వసతులు, తరగతి గదుల పరిస్థితిని వారు పరిశీలించారు.
మండలంలోని బిక్నెల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజేవీపీ) ఆధ్వర్యంలో నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా టీజేవీపీ డివిజన్ అధ్యక్షులు మీసాలె నాగేష్ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, మౌలిక వసతులు, తరగతి గదుల పరిస్థితిని పరిశీలించారు.
విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని సంబంధిత అధికారులను కోరారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ విద్యార్థి పరిషత్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి వీరేష్తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.












