భైంసా పట్టణంలోని కిసాన్ గల్లీకి చెందిన తాడివార్ కరుణాకర్ కుమార్తె నిఖిల, కొడంగల్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించిన సందర్భంగా ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆమెను ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిఖిల ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించడం అభినందనీయమన్నారు. ఆమె తల్లిదండ్రులకు మంచి పేరు, కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. విద్య ద్వారానే పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా మారుతుందని, సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్ఠలు సాధించేందుకు విద్య ఎంతో కీలకమని ఆయన తెలిపారు.
విద్యావంతులైన యువత భవిష్యత్తులో సమాజానికి మరింత సేవ చేయగలరని ఆయన అన్నారు. నిఖిల వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసి, ప్రజలకు సేవ చేసే మంచి వైద్యురాలిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఆమె తల్లిదండ్రులకు కూడా ఆయన అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కిసాన్ గల్లీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.












