భువనగిరి, 15 September
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళవారం సామూహిక గిరిప్రదక్షిణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన సతీమణి అనితతో కలిసి పాల్గొన్నారు.
యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ చేసిన బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట, సెప్టెంబరు 15: స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో మంగళవారం సామూహిక గిరిప్రదక్షిణ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన సతీమణి అనితతో కలిసి గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. గిరిప్రదక్షిణకు ముందు వైకుంఠ ద్వారం వద్ద ఉన్న పాదాలకు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది, స్థానికులు, వేలాది మంది భక్తులతో కలిసి యాదాద్రి కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ భక్తిశ్రద్ధలతో గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. అనంతరం బీర్ల ఐలయ్య దంపతులు శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ అధికారులు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించారు. స్వామివారి ఆశీస్సులతో ఆలేరు నియోజకవర్గంతో పాటు యాదాద్రి జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని బీర్ల ఐలయ్య ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.











