తానూర్, 15 September
మండలం బోసి గ్రామంలో కొలువైన శ్రీ వరసిద్ధి కర్ర వినాయకుడిని మంగళవారం అధికారులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీధర్, ముధోల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ నాయక్, ఎస్ఐ షేక్ జుబేర్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
వరసిద్ధి కర్ర వినాయకుడిని దర్శించుకున్న అధికారులు తానుర్ మండలం బోసి గ్రామంలో కొలువైన శ్రీ వరసిద్ధి కర్ర వినాయకుడిని మంగళవారం అధికారులు దర్శించుకున్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీధర్ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ముధోల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ నాయక్, ఎస్ ఐ షేక్ జుబేర్,స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు అధికారులకు స్వాగతం పలికారు.వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా బోసిలో కొలువైన కర్ర వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.











