బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 10
మండలం మాంజరి గ్రామంలో శ్రావణమాసం సందర్భంగా నిర్వహిస్తున్న భజన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గురువారం గ్రామస్తులు భగవన్నామస్మరణలో పాల్గొన్నారు. భజనలు, నామసంకీర్తనలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
మాంజరిలో మార్మోగిన భగవన్నామస్మరణ , సెప్టెంబర్ 10 ( శ్రావణమాసం సందర్భంగా మండలం మాంజరి గ్రామంలో నిర్వహిస్తున్న భజన కార్యక్రమాలు భక్తిభావంతో కొనసాగుతున్నాయి. గురువారం గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో భజన కార్యక్రమంలో పాల్గొని భగవన్నామస్మరణ చేశారు. భజనలు, నామసంకీర్తనలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భగవంతుని నామస్మరణతో మనసుకు ప్రశాంతత, గ్రామానికి శుభం కలగాలని భక్తులు ఆకాంక్షించారు. గ్రామంలో అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థించారు. ప్రతి కుటుంబం పిల్లాపాపలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని, గ్రామ ప్రజల మధ్య ఐకమత్యం, సోదరభావం ఎల్లప్పుడూ కొనసాగాలని భగవంతుడిని వేడుకున్నారు.శ్రావణమాసంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న భజన కార్యక్రమాల్లో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భగవన్నామస్మరణతో గ్రామమంతా భక్తిమయంగా మారింది.












