భైంసా, Bhainsa, Nirmal, Telangana (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
భైంసాలో గణపతి నవరాత్రుల సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని శాంతి కమిటీ సమావేశంలో నిర్ణయించారు. భైంసా మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంపై చర్చించారు.
భైంసాలో గణపతి నవరాత్రులపై శాంతి కమిటీ కీలక సమావేశం భైంసా గణపతి నవరాత్రుల సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. భైంసా మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ మాట్లాడుతూ.. గణపతి నవరాత్రుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని, నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు సూచించారు. వివిధ శాఖల అధికారులు, కౌన్సిల్ సభ్యులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. శాంతికి భంగం కలిగించే చర్యలను అడ్డుకుంటూ గణపతి నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో సోదరభావంతో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పాటిల్, మున్సిపల్ చైర్మన్ తుమ్మొల్ల దత్తు, ఆత్మ చైర్మన్ సిద్ధం వివేకానంద, బబ్రూ మహారాజ్ సిరికొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.












