లోకేశ్వరం, 10 September
మండలంలో పోలాల అమావాస్య పండుగను పురస్కరించుకుని వివిధ గ్రామాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. రైతులు, మహిళలు కుటుంబ సమేతంగా పాల్గొని సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
లో ఘనంగా పోలాల అమావాస్య వేడుకలు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన రైతులు మండలం మనో రంజని తెలుగు టైమ్స్ లో పోలాల అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని వివిధ గ్రామాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలు కుటుంబ సమేతంగా పాల్గొని సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగలో భాగంగా వ్యవసాయ పనిముట్లను శుభ్రపరిచి పూజలు చేయడంతో పాటు పశువులను ప్రత్యేకంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజించారు. గ్రామాల్లో ఉదయం నుంచే పండుగ సందడి నెలకొంది. మహిళలు సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. పశుసంపద ఆరోగ్యంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని రైతులు ప్రార్థించారు. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో ఆధ్యాత్మిక, పండుగ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ప్రజలు పోలాల అమావాస్యను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.












