Hyderabad, Telangana (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 09
భక్తులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే కార్తీక మాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. దీపావళి పండుగతో ఆశ్వయుజ మాసం ముగియనుంది. ఈ పవిత్ర మాసంలో శివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
దీపావళి పండుగతో ఆశ్వయుజ మాసం ముగియనుండగా, భక్తులకు ఎంతో ప్రాధాన్యత కలిగిన కార్తీక మాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. మాఘ మాసంలో సూర్య భగవానుడిని, శ్రావణ మాసంలో శ్రీలక్ష్మిదేవిని, ఆశ్వయుజ మాసంలో దుర్గాదేవిని, కార్తీకమాసంలో శివుడిని, మార్గశిర మాసంలో శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో భక్తులు పూజిస్తారు.
2026, వ తేదీ అనగా.. రేపు మంగళవారం నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. వ తేదీ మంగళవారంతో ఈ మాసం ముగియనుంది. ఈ మాసంలో పండుగలు అధికంగా ఉంటాయి.
కార్తీకమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు
నాగుల చవితి, నాగ పంచమి, మొదటి కార్తీక సోమవారం, క్షీరాబ్ది ద్వాదశి, రెండో కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి, మూడో కార్తీక సోమవారం, నాలుగో కార్తీక సోమవారం, మాస శివరాత్రి వంటివి ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు.











