మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు తినిపిస్తూ సంబరాలు చేసుకున్నారు. నిర్మల్ జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీ పురం శెట్టి రవికుమార్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. రైతులకు, మహిళలకు, పేదలకు అండగా నిలుస్తూ ప్రజాపాలనను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












