నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి పూజలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని, తమ కుటుంబాలు సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. భక్తుల ఆనందోత్సాహాల మధ్య పూజా కార్యక్రమాలు వైభవంగా ముగిశాయి.











