మండలంలోని ఐదు గ్రామాల్లో 11వ రోజు గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమాల విజయవంతానికి సహకరించిన గ్రామస్తులకు, కమిటీ సభ్యులకు ఎస్సై షేక్ జుబేర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మండలంలోని బామ్నీ, మహాలింగి, బోసి, బొంద్రట్, బెల్ తరోడ గ్రామాల్లో 11వ రోజు గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ఐదు గ్రామాల సర్పంచులు, గ్రామస్తులు, గణేష్ యూత్ కమిటీ సభ్యులు, వీడీసీ సభ్యులకు ఎస్సై షేక్ జుబేర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఎస్సై షేక్ జుబేర్ మాట్లాడుతూ, గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఐదు గ్రామాల ప్రజలు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తూ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారని అన్నారు. యువత, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులతో సమన్వయం చేసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పోలీసులకు సహకరిస్తూ పండుగలను శాంతియుతంగా నిర్వహించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో బెల్ తరోడ గ్రామ సర్పంచ్ గోప సుజాత సాయినాథ్, మాజీ మైనారిటీ అధ్యక్షులు మౌలాఖాన్, పోలీస్ సిబ్బంది, గణేష్ యూత్ కమిటీ సభ్యులు, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.












