నిర్మల్ జిల్లా మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న మోక్ష గణేశుని శోభాయాత్ర వైభవంగా జరిగింది. మహిళలు, యువకులు బ్యాండ్ మేళాలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు.
గ్రామంలోని గ్రామస్తులందరూ కలిసి మోక్ష గణేష్ ముందు గుంజీలు తీసి తమ భక్తిని చాటుకున్నారు. గత 11 రోజులుగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి రోజు దాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 11వ రోజున స్థానికులతో పాటు ఇరుగుపొరుగు గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. బాయ్ బాయ్ గణేశ అంటూ, వచ్చే సంవత్సరం రావయ్యా అంటూ నినాదాలు చేస్తూ ఈ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు.











