మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందిస్తున్న అన్నదాత కిషోర్ ను ఎమ్మెల్యే సన్మానించారు.
శాంతియుత వేడుకలకు పిలుపు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, యువకులు ఎంతో ఉత్సాహంతో జరుపుకునే వినాయక చవితి వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. అన్నదాన కార్యక్రమానికి ముందుకొచ్చిన కిషోర్‌ను విగ్నేశ్వరుడు అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని కోరుకున్నట్లు తెలిపారు.
నాయకుల భాగస్వామ్యం
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












