వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ ముధోల్ నియోజకవర్గ ఇన్చార్జి విలాస్ గాదెవార్ కుటుంబ సమేతంగా గణనాథులను దర్శించుకున్నారు. పాలజ్, మాటెగాం గ్రామాల్లోని ప్రసిద్ధ విఘ్నేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా పాలజ్ గ్రామంలోని ప్రసిద్ధ వరసిద్ధి కర్ర విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలంలోని మాటెగాం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన కోరడి గణేష్‌ను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మాటెగాం గ్రామంలోని కోరడి గణేష్ వద్ద విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా విలాస్ గాదెవార్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రతి కుటుంబానికి గణనాథుని ఆశీస్సులు ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు విలాస్ గాదెవార్ తెలిపారు. ప్రతి ఒక్కరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.



