మండలం నందిరాజుతోట గ్రామంలోని తారకరామ కాలనీలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథుని మండపాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాలనీ ప్రజలతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గణనాథుని ప్రార్థించారు.
అన్నదానం కార్యక్రమంలో ఎమ్మెల్యే
పూజా కార్యక్రమాల అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తాతా జయప్రకాష్ నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి కందుల బాలకోటేశ్వరరావు, నల్లమూలు యలమంద, ఏమినేని రామారావు, కర్రి వెంకటస్వామి, మరీదు శ్రీనివాసరావు, ఏమినేని శివరామకృష్ణతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












