మంచిర్యాల (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 11
జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. లక్షెటిపేట పట్టణానికి చెందిన సతీష్ అనే నకిలీ బాబా, పూజల పేరుతో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. జగిత్యాల జిల్లాకు చెందిన బాలికను తల్లిదండ్రులు సతీష్ వద్దకు తీసుకురాగా ఈ ఘటన జరిగింది. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. లక్షెటిపేట పట్టణంలోని గోదావరి రోడ్డుకు చెందిన సతీష్ అనే నకిలీ బాబా పూజల పేరుతో 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లాకు చెందిన బాలికను తల్లిదండ్రులు సతీష్ దగ్గరకు తీసుకురాగా, అతను పూజల పేరుతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న లక్షెటిపేట పోలీసులు దొంగబాబాపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉంది. దొంగ బాబాల మాయలో పడి మోసపోతున్నవారు చాలా మంది ఉన్నారు. కొంతమంది బాబాలు అమాయక జనాల దగ్గర డబ్బులు గుంజడమే కాకుండా ఇలాంటి దారుణాలకు సైతం పాల్పడుతున్నారు. కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు దొంగ బాబాలతో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.












