నిజామాబాద్, 10 September
ఆల్ప్రాజోలం అక్రమ రవాణా కేసు దర్యాప్తులో నిజామాబాద్ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించారు. నేరంతో సంబంధం ఉన్న సుమారు 10 మంది వ్యక్తుల మొబైల్ ఫోన్ సమాచారాన్ని సేకరించి విశ్లేషించడం ద్వారా కీలక ఆధారాలను గుర్తించారు. డ్రగ్ నెట్‌వర్క్‌ను ఛేదించి, అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకునే దిశగా పోలీసులు ముందుకు సాగుతున్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతో కీలక ఆధారాల సేకరణ నిజామాబాద్, సెప్టెంబర్ 10 ( ఆల్ప్రాజోలం అక్రమ రవాణా కేసు దర్యాప్తులో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించారు. నేరంతో సంబంధం ఉన్న సుమారు 10 మంది వ్యక్తుల మొబైల్ ఫోన్ సమాచారాన్ని సేకరించి విశ్లేషించడం ద్వారా దర్యాప్తునకు అవసరమైన కీలక ఆధారాలను గుర్తించారు. ఆల్ప్రాజోలం అక్రమ రవాణాను గుర్తించడం నుంచి డ్రగ్ నెట్‌వర్క్‌ను ఛేదించడం, అక్రమంగా సంపాదించిన ఆస్తులను గుర్తించడం వరకు పోలీసులు నిరంతరం శ్రమించారు.డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేయడంతోపాటు, మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి చట్టపరంగా జప్తు, అటాచ్మెంట్ చర్యలు చేపట్టనున్నట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. డ్రగ్ నెట్‌వర్క్‌పై ఆర్థిక దర్యాప్తు కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు.మాదకద్రవ్యాల తయారీ, కొనుగోలు, రవాణా, నిల్వ, పంపిణీ, విక్రయాలు, ఆర్థిక లావాదేవీలు, వినియోగం వరకు మొత్తం వ్యవస్థపై నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు. అంతర్జిల్లా పోలీసుల సమన్వయంతో దర్యాప్తును మరింత విస్తృతం చేస్తామని వెల్లడించారు.ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన నిజామాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ సి.హెచ్. శ్రీనివాస్, సంబంధిత పోలీసు సిబ్బంది, నిజామాబాద్ ఈగల్ టీమ్‌ను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రత్యేకంగా అభినందించారు. డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. డ్రగ్స్ అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు. మత్తు పదార్థాల దుర్వినియోగాన్ని అరికట్టడంలో, ముఖ్యంగా యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడడంలో ప్రజల సహకారం కీలకమని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.












