చుక్కాయూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 10
వ్యక్తిగత కారణాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఒక మహిళ, తన ఇద్దరు చిన్నారులతో కలిసి రైల్వే ట్రాక్‌పైకి వెళ్లగా, పోలీసులు సమయస్ఫూర్తితో స్పందించి వారిని సురక్షితంగా కాపాడారు. చుక్కాయూర్ గ్రామానికి చెందిన సంధ్యారాణి అనే మహిళ ఈ ఘటనలో బాధితురాలు.
రైల్వే ట్రాక్‌పైకి వెళ్లిన మహిళ, పిల్లలను కాపాడిన పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుళ్లు : వ్యక్తిగత కారణాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి రైల్వే ట్రాక్‌పైకి వెళ్లగా పోలీసులు సమయస్ఫూర్తితో స్పందించి వారిని సురక్షితంగా కాపాడారు. చుక్కాయూర్ గ్రామానికి చెందిన సంధ్యారాణి (30) తన ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తెను పాఠశాల నుంచి తీసుకుని ఇంటికి వెళ్లకుండా తీవ్ర మనస్తాపానికి గురైంది. పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది.సమాచారం అందుకున్న కానిస్టేబుల్ కళ్యాణ్ (పీసీ–2918), ఏఆర్పీసీ రామకృష్ణ (3042) వెంటనే స్పందించి అక్కడికి చేరుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి మహిళతో పాటు ఇద్దరు చిన్నారులను సురక్షితంగా కాపాడారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. కుటుంబ సమస్యలను పరిష్కరించుకునేలా ధైర్యం చెప్పి, చిన్నారుల భద్రతపై తగిన సూచనలు చేశారు.ప్రమాద పరిస్థితిని గుర్తించి వెంటనే స్పందించి తల్లి, ఇద్దరు చిన్నారుల ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ కళ్యాణ్, ఏఆర్పీసీ రామకృష్ణలను పట్టణ సీఐ నరహరి అభినందించారు. వారి సమయస్ఫూర్తిని ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.












