భద్రాచలం, 8 September
భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఇసుక బండ్ల కోసం ఎద్దులను అధికంగా శ్రమపెడుతూ, విశ్రాంతి లేకుండా తిప్పుతూ, అలసిపోయినప్పుడు కొట్టడం వంటి మూగజీవాలపై క్రూరత్వ చర్యలను అరికట్టాలని కోరుతూ బీజేపీ భద్రాచలం బృందం డీఎస్పీ, ఎస్డీపీఓ ఎం. అరుణ్ కుమార్ ను కలిసి వినతిపత్రం అందజేసింది. గోదావరి ఇసుక ర్యాంపుల నుంచి పట్టణానికి ఇసుక తరలింపులో ఈ ఘటనలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు.
*మూగజీవాలపై క్రూరత్వాన్ని అరికట్టాలి: భద్రాచలం డీఎస్పీకి బీజేపీ ప్రతినిధుల వినతి* *భద్రాచలం, :* భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఎద్దులు, ఆవులతో ఇసుక బండ్లు లాగిస్తూ అధిక బరువులు మోయించడం, విశ్రాంతి లేకుండా పదేపదే తిప్పడం, అలసిపోయిన మూగజీవాలను కొట్టడం వంటి చర్యలను అరికట్టాలని కోరుతూ *బీజేపీ భద్రాచలం బృందం* భద్రాచలం డీఎస్పీ, ఎస్డీపీఓ *శ్రీ ఎం. అరుణ్ కుమార్* గారిని కలిసి వినతిపత్రం అందజేసింది. గోదావరి ఇసుక ర్యాంపుల నుంచి భద్రాచలం పట్టణం వైపు ఎద్దుల బండ్ల ద్వారా ఇసుక తరలిస్తున్న సమయంలో మూగజీవాలపై జరుగుతున్న క్రూరత్వంపై తక్షణమే విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ బృందం కోరింది. పశువులతో పని చేయించడం సంప్రదాయంలో భాగమే అయినప్పటికీ, *అధిక బరువులు మోయిస్తూ, విశ్రాంతి లేకుండా నడిపిస్తూ, కొట్టడం మాత్రం క్రూరత్వమే* అని పేర్కొన్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులు, పశువులపై జరుగుతున్న దోపిడీపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి పవిత్ర క్షేత్రమని, గోమాతను గౌరవించే మన సంస్కృతిలో మూగజీవాలపై క్రూరత్వానికి తావులేకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని *బీజేపీ భద్రాచలం బృందం* డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో *బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సంతోష్, బీజేపీ నాయకులు కుంజా ధర్మా, నిడదవోలు నాగబాబు, ముత్యాల చంద్రశేఖర్, గంగులకుర్తి రామాచారి* తదితరులు పాల్గొన్నారు.












