24 గంటల్లో బాలుడి అపహరణ కేసు ఛేదన సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో ఆచూకీ గుర్తింపు.. లో సురక్షితంగా రక్షణ నిజామాబాద్, సెప్టెంబరు 6: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం నుంచి అపహరణకు గురైన రెండున్నరేళ్ల బాలుడు వేదాంష్ను పోలీసులు 24 గంటల్లోనే సురక్షితంగా రక్షించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబరు 5న ఉదయం 10.30 గంటల సమయంలో బాలుడు వేదాంష్ను ఇద్దరు వ్యక్తులు మాయమాటలు చెప్పి ఆసుపత్రి నుంచి తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా.. టౌన్-1 పోలీసులు, సీసీఎస్, క్రైమ్, సివిల్, టెక్నికల్ బృందాలు సమన్వయంతో దర్యాప్తు చేపట్టాయి. ఆసుపత్రితో పాటు వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ నిందితుల కదలికలను గుర్తించారు. పోలీసుల నిరంతర గాలింపు, దర్యాప్తు ఫలితంగా జిల్లా దౌల్తాబాద్ గ్రామంలో బాలుడి ఆచూకీ లభించింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడిని సురక్షితంగా రక్షించారు. ఇద్దరు నిందితులు అదుపులో.. ఈ కేసులో మెదక్ జిల్లా నిజాంపేట్ గ్రామానికి చెందిన, ప్రస్తుతం మేడ్చల్లో నివసిస్తున్న కోతాడి సుజాత (30), కోతాడి యెల్లం (38)లను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రక్షించిన బాలుడికి అవసరమైన వైద్య పరీక్షలు, చట్టపరమైన ప్రక్రియలు పూర్తిచేసిన అనంతరం తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించనున్నట్లు వెల్లడించారు. పోలీసులకు కమిషనర్ అభినందనలు బాలుడి ఆచూకీని కేవలం 24 గంటల్లోనే గుర్తించి సురక్షితంగా రక్షించడంలో టౌన్-1, సీసీఎస్, క్రైమ్, సివిల్, టెక్నికల్ బృందాల సమన్వయం కీలకంగా నిలిచిందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. దర్యాప్తులో సహకరించిన జిల్లా పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు.
24 గంటల్లో బాలుడి అపహరణ కేసు ఛేదన
Share:

సారాంశం
సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితుల ఆచూకీ గుర్తింపు.. ఇద్దరు అరెస్ట్
ముఖ్య విషయాలు
- 24 గంటల్లో బాలుడి అపహరణ కేసు ఛేదన సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో ఆచూకీ గుర్తింపు..
- సెప్టెంబరు 5న ఉదయం 10.30 గంటల సమయంలో బాలుడు వేదాంష్ను ఇద్దరు వ్యక్తులు మాయమాటలు చెప్పి ఆసుపత్రి నుంచి తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- టౌన్-1 పోలీసులు, సీసీఎస్, క్రైమ్, సివిల్, టెక్నికల్ బృందాలు సమన్వయంతో దర్యాప్తు చేపట్టాయి.
- లో సురక్షితంగా రక్షణ నిజామాబాద్, సెప్టెంబరు 6: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం నుంచి అపహరణకు గురైన రెండున్నరేళ్ల బాలుడు వేదాంష్ను పోలీసులు 24 గంటల్లోనే సురక్షితంగా రక్షించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3344ఆర్టికల్స్
4,22,469వ్యూస్










