సారంగాపూర్, 7 September
నిర్మల్ జిల్లా మండలంలోని కొన్ని గ్రామాల్లో రేషన్ బియ్యం అక్రమ దందా విచ్చలవిడిగా కొనసాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. పేదలకు ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని కొందరు తక్కువ ధరకు సేకరించి, మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జోరుగా అక్రమ రేషన్ బియ్యం దందా.. ప్రతిరోజు to మహారాష్ట్ర తరలింపు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్న? అక్రమార్కులకు అడ్డాగా మారిన కొన్ని గ్రామాలు.. అధికారుల నిఘా ఎక్కడ? మన తెలంగాణ నిర్మల్ జిల్లా మండలంలోని మండలంలోని కొన్ని గ్రామాల్లో రేషన్ బియ్యం అక్రమ దందా విచ్చలవిడిగా కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు తక్కువ ధరకు సేకరించి, ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని కొన్ని గ్రామాలు రేషన్ బియ్యం అక్రమ కొనుగోళ్లు, రవాణాకు అడ్డాలుగా మారుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో వాహనాల ద్వారా బియ్యం తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. పేదల బియ్యంపైనే అక్రమ వ్యాపారం ప్రభుత్వం పేద కుటుంబాలకు అందిస్తున్న రేషన్ బియ్యం వారి ఆహార భద్రతకు ఉపయోగపడాల్సి ఉండగా, కొందరు అక్రమార్కులు దానిని వ్యాపారంగా రెషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసే వ్యక్తులపై, దానిని నిల్వ చేసే గోదాములపై, రవాణా చేసే వాహనాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని కోరుతున్నారు. అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్న? రేషన్ బియ్యం అక్రమ దందా జరుగుతోందనే ఆరోపణలు ఉన్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతిరోజు టు మహారాష్ట్ర వెళ్తున్న సమాచారం ఉన్న అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి, అక్రమ నిల్వలు, రవాణాను గుర్తించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.












