జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా బైంసా పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనంద్ రావు పాటిల్, వైస్ చైర్మన్ షారుక్ అహ్మద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనంద్ రావు పాటిల్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీజీ దేశ స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గంలో సాగించిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత వంటి గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. గాంధీజీ చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు.











