మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ నూతనంగా ఎన్నికైన జాతీయ నాయకులకు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ముధోల్ మాదిగ సంఘం అధ్యక్షులు, పాంగ్ర సర్పంచ్ నామత్కర్ దిగంబర్ గారు శుభాకాంక్షలు తెలియజేశారు. నుండి ముగ్గురికి సంఘంలో బాధ్యతలు ఇవ్వడం గర్వకారణమని ఆయన తెలిపారు.
ఏం. యి. ఎఫ్ ఆధ్వర్యంలో నుండి ముగ్గురికి సంఘంలో బాధ్యతలు ఇవ్వడం చాలా గర్వంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ బాధ్యతలు రావడం వెనుక గత 32 సంవత్సరాలుగా వారు పడిన కష్టాలు, జాతి కోసం చేసిన సేవలు, నిరంతరం సమాజంలో ఉంటూ వర్గీకరణ కోసం చేసిన పోరాటం, తీసుకొచ్చిన ఐక్యతా భావం వంటి అమోఘమైన, అద్భుతమైన కష్టాలే కారణమని పేర్కొన్నారు. కాబట్టి జిల్లా ఏం. యి. ఎఫ్ కు ఇన్ని బాధ్యతలు ఇవ్వడం మన నాయకులపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని తెలియజేశారు. అదే నమ్మకంతో ముందుకు కొనసాగాలని, పద్మశ్రీ మంద కృష్ణ అడుగుజాడల్లో నడవాలని కోరుతున్నామని అన్నారు. గత రెండేళ్ల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కి మన సామాజిక వర్గం నుండి ఓట్లు వేయడమే కాకుండా ప్రచారం చేయాలని కూడా అన్నగారు ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ కొందరు ఏం. యి. ఎఫ్ నాయకులు అన్నగారి ఆదేశాలను లెక్కచేయకుండా టీ. ర్. ఎస్ నాయకులతో కలిసి ఎన్నికల్లో ప్రచారం చేశారని తెలిపారు. కాబట్టి, అన్నగారి పేరుతో నాయకులు అని చెప్పుకుంటూ, ఆయన సూచనలకు తూట్లు పొడిచే నాయకులు ఇప్పుడైనా క్రమశిక్షణతో, ఏం. యి. ఎఫ్ (ఏం. ఆర్. పి. స్) నిర్ణయమే మన నిర్ణయంగా భావించి ముందుకు సాగాలని ముధోల్ మాదిగ సామాజిక వర్గం కోరుకుంటుంది.












