నిర్మల్ జిల్లా మండలంలోని ఝరీ (బి) గ్రామంలో మంగళవారం షేక్ అల్లా ఉద్దీన్ మౌలా సాబ్ నూతన గృహప్రవేశ మహోత్సవం జరిగింది. ఈ వేడుకకు యువ నాయకుడు గైక్వాడ్ సాయినాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గైక్వాడ్ సాయినాథ్, అల్లా ఉద్దీన్ కుటుంబ సభ్యులకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన గృహం కుటుంబ సభ్యులందరికీ సుఖసంతోషాలు, సకల ఐశ్వర్యాలు అందించాలని ఆయన ఆకాంక్షించారు.
స్వంత ఇంటి కల నెరవేరడం ఎంతో సంతోషకరమైన విషయమని, నూతన గృహంలో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గైక్వాడ్ సాయినాథ్ శుభకాంక్షలు తెలిపారు.
ఝరి (బి) గ్రామానికి చెందిన బంధువులు, మిత్రులు, యువకులు పెద్ద సంఖ్యలో ఈ గృహప్రవేశ వేడుకలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.












