ప్రొద్దుటూరులో గుర్తుతెలియని మృతదేహాలకు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో ఒక వ్యక్తి మృతి చెందగా, ఎర్రగుంట్లలో మరో మృతదేహం లభించింది. బంధువులు ముందుకు రాకపోవడంతో సేవా సంస్థ ఈ బాధ్యత చేపట్టింది.
ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందగా, మరో మృతదేహం ఎర్రగుంట్లలో లభించింది. ఆ మృతదేహాలను ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు బంధువులు ముందుకు రాకపోవడంతో ఆసుపత్రి, పోలీసు సిబ్బంది మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ పట్టణ అధ్యక్షుడు సుబహాన్‌ను ఫోన్ ద్వారా సంప్రదించారు. స్పందించిన ఫౌండేషన్ సభ్యులు ముందుకు వచ్చి, హిందూ స్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్‌రావు, పట్టణ అధ్యక్షుడు సుబహాన్, అహమ్మద్ హుస్సేన్, అశోక్, సతీష్, గౌస్ పాల్గొని అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ, సమాజంలో ఎవరూ లేని వారికి కూడా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరగాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. అవసరంలో ఉన్న వారికి అండగా నిలుస్తూ, ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలోని శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు ఫౌండేషన్‌ను సంప్రదించాలని సభ్యులు కోరారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 82972 53484, 9182244150.












