బాసర మండలంలోని టాక్లి గ్రామానికి చెందిన నాగభూషణం విద్యాలయ ప్రిన్సిపాల్ బాబురావు తండ్రి జారికోటె ఇరువంత్ పాటిల్ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రజా ట్రస్ట్ చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకుడు బోస్లే మోహన్రావు పటేల్ శనివారం టాక్లి గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పారు.
మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ట్రస్ట్ ప్రతినిధులు, బీజేపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.










