నిర్మల్ రూరల్, 10 September
నిర్మల్ మండలంలోని రాణాపూర్ గ్రామంలో ఎడ్ల పండుగ అమావాస్య వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. రైతులు తమ ఎడ్లను ప్రత్యేకంగా అలంకరించి, సంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు.
రాణాపూర్లో ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య నిర్మల్ నిర్మల్ మండలంలోని రాణాపూర్ గ్రామంలో ఎడ్ల పొలాల అమావాస్య వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఎడ్లను ప్రత్యేకంగా అలంకరించి, సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. ఎడ్లకు స్నానం చేయించి, పూలమాలలు, రంగురంగుల వస్త్రాలు, వివిధ అలంకరణలతో ముస్తాబు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, రైతులకు మంచి పంటలు పండాలని, గ్రామంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వేడుకల్లో గ్రామ రైతులు, యువత, మహిళలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలంకరించిన ఎడ్లతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సంప్రదాయాలను కొనసాగిస్తూ ఎడ్ల పొలాల అమావాస్యను ఉత్సాహంగా జరుపుకున్నారు. – రాణాపూర్, నిర్మల్












