సారంగాపూర్ మండల వ్యవసాయ అధికారి (ఏవో) వికార్ అహ్మద్ కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులను గుర్తించి, ఉత్తమ సేవా పురస్కారాలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.
సారంగాపూర్ మండల వ్యవసాయ అధికారి (ఏవో) వికార్ అహ్మద్ కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులను గుర్తించి, ఉత్తమ సేవా పురస్కారాలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. సారంగాపూర్ మండలానికి చెందిన ఏవో వికార్ అహ్మద్ చేసిన సేవలకు గాను, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, కలెక్టర్ భవిష్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో మరింత బాధ్యతగా ఉంటామని తెలిపారు.












