నిర్మల్ డివిజన్ ఉద్యాన అధికారి మండలంలోని ధని, సాయినగర్ తండా గ్రామాల్లో పసుపు తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పసుపు సాగులో దుంప ఈగ, ఆకు మచ్చ తెగుళ్ల నివారణకు సకాలంలో మందులు పిచికారీ చేసుకోవాలని రైతులకు సూచించారు.
నిర్మల్ డివిజన్ ఉద్యాన అధికారి మండలంలోని ధని, సాయినగర్ తండా గ్రామాల్లో పసుపు తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పసుపు సాగు చేసే రైతులు దుంప ఈగ, ఆకు మచ్చ తెగుళ్లను వెంటనే గమనించి మందులు పిచికారీ చేసుకోవాలని సూచించారు. పసుపులో తెగుళ్లు ఎక్కువగా వ్యాప్తి చెందకుండా బిందు సేద్యం ద్వారా నీటిని అందించాలని తెలిపారు. బిందు సేద్య పరికరాల కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకొని, ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధని గ్రామ సర్పంచ్ జెట్టవేని బడి పోతన్న, గంగా బాపు, పోతన్న, గుర్రం శంకర్ తో పాటు ఇతర రైతులు పాల్గొన్నారు.












