లక్ష్మణచాంద, 30 September
లక్ష్మణ్ చందా మండలంలోని పీచర గ్రామానికి చెందిన రైతు కొండి ముత్తన్న మరణించిన నేపథ్యంలో, ఆయన కుటుంబానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లక్ష్మణ్ చందా ఆధ్వర్యంలో 2,00,000 రూపాయల బీమా చెక్కును అందజేశారు. సహకార సంఘం చైర్మన్ శ్రీ ఎర్ర రఘునందన్ రెడ్డి, వైస్ చైర్మన్ సింగం వెంకట రాజు, డైరెక్టర్లు రాజా రెడ్డి, నరేష్ లు ఈ చెక్కును రైతు కుటుంబానికి అందించారు. రైతుల సంక్షేమానికి సంఘం అన్ని విధాల అండగా ఉంటుందని ఈ సందర్భంగా చైర్మన్ రఘునందన్ రెడ్డి తెలిపారు. రైతులందరూ తమ ఆధార్ వివరాలను సంఘంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్, అధికారి సాయి ప్రసాద్, సంఘ కార్యదర్శి వజీర్ పాష, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ చందా సర్పంచ్ ఓస కవిత రాజు, మునిపల్లి ఉప సర్పంచ్ రంజిత్ రెడ్డి, సంఘ సిబ్బంది రమణ, నర్సయ్య, సతీష్, సాయి, రాజేశ్వర్ తో పాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.