భవన్లో (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల్‌లో బుధవారం ఆయన జిల్లా కలెక్టర్‌తో కలిసి సవరణ ప్రక్రియను పరిశీలించారు.
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాలి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా ప్రత్యేక సమగ్ర సవరణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్మల్, సెప్టెంబరు 9 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని అంబేడ్కర్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి సవరణ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాలని సూచించారు. మృతులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను నిబంధనల ప్రకారం గుర్తించి తొలగించాలని ఆదేశించారు. ఓటర్ల పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో తప్పులు ఉంటే నిబంధనల మేరకు సరిచేయాలన్నారు. ఇంటింటి సర్వేలో ప్రతి కుటుంబంలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ధ్రువీకరించిన సమాచారం ఆధారంగానే మార్పులు, చేర్పులు, తొలగింపులు చేపట్టాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పత్రాలను పరిశీలించి అవసరమైన వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.పద్దెనిమిదేళ్లు నిండిన అర్హులైన యువత ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో పరిశీలించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని వివరించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితాలో నమోదు కాకుండా మిగిలిపోకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అనర్హుల పేర్లు కొనసాగకుండా నిబంధనల మేరకు చర్యలు చేపడుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, ఉప పోలీసు అధికారి శ్రీనివాస్, రెవెన్యూ విభాగ అధికారి దేవీదాస్, తహసీల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.











