మండల కేంద్రమైన ముధోల్ లో గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ షబానా బేగం ఇజాజోద్దీన్, ఈఓ అన్వర్ అలీ మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలను కొనసాగించాలని, ఎల్ నినో ప్రభావం దృష్ట్యా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
గాంధీజీ 155వ జయంతిని పురస్కరించుకుని ముధోల్ మేజర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా వేడుకలు జరిగాయి. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ చౌక్ లో చైతన్య యూత్ ఆధ్వర్యంలోనూ గాంధీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ షబానా బేగం ఇజాజోద్దీన్, ఈఓ అన్వర్ అలీ మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రతి గ్రామంలో సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలను నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో ముఖ్యంగా నీటి సంరక్షణపై విబిజి రామ్ జి లో లో భాగంగా సాగునీటి, తాగునీటి పథకాల గురించి వివరించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు, ప్రతి పంట పొలంలో నీటి కుంటలు చేపట్టేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎల్ నినో ప్రభావం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటి నుండే ప్రతి నీటి బొట్టును వ్యర్థం కాకుండా సంరక్షిస్తేనే రాబోయే రోజుల్లో మానవాళికి తాగునీరు, పంటలకు సాగునీరు లభిస్తుందని, లేనియెడల కరవుతో కొట్టుమిట్టాడటం ఖాయమని హెచ్చరించారు. నీటి సంరక్షణపై ప్రభుత్వం అందిస్తున్న సూచనలను ప్రతి ఒక్కరూ పాటిస్తారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముధోల్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కోరి లావణ్య, ఈఓ అన్వర్ అలీ, వార్డు సభ్యులు బషీర్, బత్తినోళ్ల సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.












