తానూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వికసిత్ గ్రామ్ పంచాయత్ ప్రణాళిక, వికసిత్ భారత్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) చట్టం, 2025 మండల స్థాయి అధికారులకు, ప్రజాప్రతినిధులకు సామర్థ్య పెంపుదల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) శ్రీధర్ మాట్లాడుతూ, గ్రామాల సర్వాంగీణ అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపుదిద్దుకుందని పేర్కొన్నారు.
వికసిత్ గ్రామ్ పంచాయత్ ప్రణాళిక తయారీలోనూ, దాని సమర్థవంతమైన అమలులోనూ వివిధ శాఖల సమన్వయం అత్యంత కీలకమని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రతి పథకం ప్రజలకు సక్రమంగా అందేలా, భాగస్వామ్య పద్ధతిలో ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సాంకేతిక సహాయకులు (టీఏలు), ఫీల్డ్ అసిస్టెంట్లు (ఎఫ్ఏలు) తదితరులు పాల్గొన్నారు.











