లోకేశ్వరంలోని రైతు వేదికలో వికసిత్ గ్రామ పంచాయతీ మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధుల అవగాహన కార్యక్రమం జరిగింది. గ్రామాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపొందించబడింది.
లోకేశ్వరం లో వికసిత్ గ్రామ పంచాయతీ అవగాహన కార్యక్రమం జరిగింది. లోకేశ్వరంలోని రైతు వేదికలో మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపొందించబడినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రణాళిక అమలులో వివిధ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీఓ సల్మాన్ రాజ్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు కదం భుజంగరావు, వివిధ గ్రామ సర్పంచులు, ఇన్చార్జి ఏపీవో అనిల్, ఐకెపి ఏపీఎం భోజన్న, వెటర్నరీ డాక్టర్ సాద్ నవాస, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాయి వర్ధన్, వి.బి.జి. రామ్ జి. టి.ఏ.లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐకెపి సీసీలు, వీవోఏలు తదితరులు పాల్గొన్నారు.











