నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయ ఆవరణలో సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలువురు ఆయన సేవలను కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని, పదవుల కంటే ప్రజల ఆకాంక్షలకే ప్రాధాన్యం ఇచ్చిన గొప్ప పోరాటయోధుడని వక్తలు కొనియాడారు.
అనంతరం అన్నదాన వితరణ, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్, మాజీ జడ్పీటీసీ భోల్లోజి నర్సయ్య, మాజీ ఆడెల్లి చైర్మన్ ఉట్ల రాజేశ్వర్, మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు సామల వీరయ్య, లక్ష్మీ నారాయణ, రమేష్, ప్రసాద, శంకర్ భుమేష్, నర్సయ్య, శ్రీనివాస్ యోగేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.











