నిర్మల్ జిల్లా మండలంలోని బామ్నీ గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకేట పోశెట్టి, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర్ బాయి రాజన్న హాజరై చాకలి ఐలమ్మ సేవలను స్మరించుకున్నారు.
పోరాట స్ఫూర్తిని కొనియాడిన నాయకులు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి స్ఫూర్తిదాయకమని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ఐలమ్మ జీవితం ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఆమె ఆశయాలను నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గణేష్, ఉప సర్పంచ్ గంగాధర్, రజాక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుంకేట పోశెట్టి, గ్రామ రజాక సంఘం అధ్యక్షులు దుర్గావార్ గంగాధర్, వార్డు సభ్యులు డాక్టర్ లాల్ అన్న, బాలాజీ, సచిన్, తులసిరామ్, యోగేష్ పటేల్, భోజరాం పటేల్, మాజీ సర్పంచ్ హనుమాన్లు, మాజీ ఉప సర్పంచ్ సాయినాథ్, మాజీ వార్డు సభ్యులు మహిపాల్, శంకర్, బీఎన్ఎస్ టీవీ కొత్తూరు శంకర్, మహేష్, ఎంఎస్ఎఫ్ లింగ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.











