70వ ఎస్. జి.ఎఫ్ గేమ్స్ లలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జామ్ కు చెందిన విద్యార్థినులు ఎస్. తన్వి, ఏ. ప్రసన్న జోనల్ స్థాయిలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. వీరిద్దరూ రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు.
జోనల్ స్థాయిలో వీరి ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో, విద్యార్థినుల విజయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి శోభన షిండే, పిటి శ్రీమతి సుస్మిత, పిడి హంస మరియు ఇతర సిబ్బంది అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలలో కూడా వీరు రాణించాలని ఆకాంక్షించారు.












