జపాన్, చిత్తూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 30
జపాన్‌లోని నిస్సిన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ నేరుగా సెమీఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.
జపాన్‌లోని నిస్సిన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో కనీసం టాస్ వేయడానికి కూడా వీలుపడలేదు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. టోర్నమెంట్ నిబంధనల ప్రకారం, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న భారత్ నేరుగా సెమీఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. నిస్సిన్ కొరొగి స్పోర్ట్స్ పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇక్కడ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల అవుట్‌ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది. స్టేడియం మొత్తం వాన నీటితో నిండిపోయింది. మ్యాచ్ నిర్వహించడానికి ఏమాత్రం అనుకూలించలేదు. కనీసం ఐదు ఓవర్లకు కుదించిన మ్యాచ్ ఆడించడానికి కూడా వాతావరణం సహకరించని పరిస్థితి ఏర్పడింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భారత్‌తో పాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ కూడా దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే సెమీఫైనల్లో అడుగుపెట్టింది. హాంగ్‌కాంగ్‌తో జరగాల్సిన పాక్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా వర్షార్పణం అయింది. ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్ రద్దు కాగా, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా పాకిస్థాన్ సెమీస్‌కు చేరింది. దీంతో ఈ రెండు జట్లు నాకౌట్ దశ నుంచి నేరుగా సెమీస్‌కు చేరినట్టయింది.
ఆసియా క్రీడల్లో క్రికెట్ మ్యాచ్‌ల నిబంధనల ప్రకారం, నాకౌట్ మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దయితే మెరుగైన సీడింగ్ లేదా ఐసీసీ ర్యాంకింగ్స్ ఉన్న జట్టు తదుపరి దశకు అర్హత సాధిస్తుంది. ఇదే ఇప్పుడు ఈ రెండు జట్లకూ వర్తించింది. ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెట్టిన టీమిండియా, వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని సాధించాలనే పట్టుదలతో ఉంది. 2023లో చైనా హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత జట్టు స్వర్ణ పతకాన్ని అందుకుంది. సెమీస్ పోరులో భారత జట్టు ఎవరితో తలపడుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. శ్రీలంక, నేపాల్ మధ్య జరిగే మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో భారత్ సెమీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక వైపు మొగ్గు చూపుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు దీనిపైనే అందరి చూపూ నిలిచింది. సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ తమ తమ ప్రత్యర్థులను ఓడించగలిగితే, ఈ రెండు చిరకాల ప్రత్యర్థుల మధ్య ఫైనల్ మ్యాచ్‌ను చూడొచ్చు.












