ఉట్నూర్, 10 September
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, దళితులు వచ్చిన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ను పసుపు నీళ్లతో శుద్ధి చేశామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, దళితులను అవమానించిన బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు.
*బి ఆర్ ఎస్ నాయకుల పైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు :-* *దళితులను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ శ్రేణులు :* - నిర్మల్ డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ వెడ్మ బొజ్జు పటేల్ గారి ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు ,అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి పైన్ బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాక్యాలకు నిరసనగ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ వద్దకు దళితులు వచ్చారని వారు వచ్చిన ప్రదేశాలను పసుపు నీళ్ళతో శుద్ధి చేయాలని బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాలతో శుద్ధి చేశామని. దళితులను అవమానించేలా మాట్లాడిన బిఆర్ఎస్ మహిళా నాయకురాలు పావని గౌడ్, సంధ్యారావు లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసండ్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తే ప్రభుత్వం, పోలీసులు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోర












