ఆర్మూర్, 9 September
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఆయన మాతృమూర్తిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్లు ఆరోపిస్తున్న అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు అసెంబ్లీ గేటు వద్ద అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఆయన మాతృమూర్తిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్లు ఆరోపిస్తున్న అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు అసెంబ్లీ గేటు వద్ద అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వెంకట్రాం రెడ్డి, వెల్మల్ గోపి, మున్సిపల్ చైర్పర్సన్ రఘు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగరాజు, నందిపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దూడ వెంకటేష్, మాక్లూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దయాకర్ రావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు, సర్పంచులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వైఖరిని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. గత పాలనలో అవినీతి, అహంకారం, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారంటూ ఆరోపిస్తూ నినాదాలు చేశారు.












