సారంగాపూర్, 8 September
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్ లో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన నిర్మల్ జిల్లా మండలానికి చెందిన లైసెన్స్డ్ సర్వేయర్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ కార్యక్రమానికి వెళ్తున్నట్లు సర్వేయర్లు తెలిపారు.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్ లో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన నిర్మల్ జిల్లా నిర్మల్ నియోజకవర్గం మండలానికి చెందిన లైసెన్సుడు సర్వేయర్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం జరిగింది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర లైసెన్సుడు సర్వేయర్ల జేఏసీ పిలుపునిచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిర్మల్ జిల్లా మండలం నుండి బయలుదేరిన సర్వేయర్లను పోలీసులు ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమని సర్వేయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పనికి తగిన గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత, ప్రమాద భీమా , వెంటనే అమలు చేయాలని, లైసెన్సుడు సర్వేయర్ల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మాకు తగిన న్యాయం జరగాలని కోరారు. న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని 6500 లైసెన్స్డ్ సర్వేయర్ ల కుటుంబాలు రోడ్డు మీద వచ్చింది. సంవత్సరం ఆరు నెలల నుండి ఒక రూపాయి జీతం లేకుండా అప్పుల పాలు అవుతున్నారు. తమకు తగిన గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన లైసెన్సుడు సర్వేయర్లు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా లైసెన్స్డ్ సర్వేయర్ అసోసియేషన్ అధ్యక్షుడు, క్యాషియర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ,మండల సభ్యులు












