నిజామాబాద్, 10 September
రాష్ట్ర జనసేన పార్టీ పిలుపు మేరకు ఇటీవల నిర్వహించిన శాసనసభ ముట్టడి కార్యక్రమంలో రాష్ట్ర నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నిజామాబాద్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జనసేన నాయకుడు గుండా సంతోష్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి, కొద్దిసేపు శాంతియుతంగా మౌనం పాటించారు.
22ఏ బాధితులకు న్యాయం చేయాలి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి: జనసేన : రాష్ట్ర జనసేన పార్టీ పిలుపు మేరకు ఇటీవల నిర్వహించిన శాసనసభ ముట్టడి కార్యక్రమంలో రాష్ట్ర నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నిజామాబాద్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జనసేన నాయకుడు గుండా సంతోష్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి, కొద్దిసేపు శాంతియుతంగా మౌనం పాటించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. 22ఏ కింద బాధితులుగా ఉన్న వారికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రజలు, విద్యార్థులు, బాధితుల సమస్యలను పరిష్కరించకపోతే జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను మరింత తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు నూర రాహుల్, ధనంజయ్, ప్రసాద్, జానీ, లక్ష్మణ్, లడ్డు, మణి తదితరులు పాల్గొన్నారు.












