నిర్మల్, 8 September
హైదరాబాద్ లో ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీఐటీయూ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది.
ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి హైదరాబాద్ ధర్నాకు తరలివస్తున్న ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గం జిల్లా మనో రంజని తెలుగు టైమ్స్ * జిల్లా నుంచి హైదరాబాద్ ధర్నాకు తరలివస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని CITU జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది*. టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆశా వర్కర్లం అక్రమంగా అరెస్ట్ ఖండిస్తూ, సీఐటీయూ జిల్లా బృందం పరామర్శించి సందర్భంగా *బొమ్మెనసురేష్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి* మాట్లాడుతూ, ఆశా వర్కర్లు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ముందస్తుగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోలీసులు ధర్నాకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడం, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని CITU పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18,000 ఇస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని అమలు చేయాలని అడగడానికి హైదరాబాద్ వస్తున్న ఆశా వర్కర్లను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం? అని CITU ప్రశ్నించింది. *ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.సుజాత* మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో సాధించింది అక్రమ అరెస్టులు చేయడమేనా? అని విమర్శించింది. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం రూ.18,000 అమలు చేయడంతో పాటు వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని CITU డిమాండ్ చేసింది. ఆశా వర్కర్లపై జరుగుతున్న అక్రమ అరెస్టులను ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు తీవ్రంగా ఖండించాలని ఈ కార్యక్రమంలో *జిల్లా ఆశా వర్కర్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు సుగుణ, నాయకులు మంజుల, సంగీత, లక్ష్మి, సరస్వతి, పద్మ రాజమణి* తదితరులు పాల్గొన్నారు — CITU జిల్లా కమిటీ












