ముధోల్ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, మరిన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరుతూ, మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. భూముల బదిలీపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ మరియు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ముధోల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి కలిశారు. ముధోల్ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, ఇప్పటికే మూడు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారని తెలిపారు. నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన బాసర, , ముధోల్, లోకేశ్వరం, నర్సాపూర్ జి మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని కోరారు.
కొన్ని రోజుల క్రితం నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన రివ్యూ మీటింగ్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు సూచనల మేరకు, మండలం, ఇతర మండలాల్లోని కొన్ని గ్రామాల్లో పంజాబ్ వారు కొన్న భూముల్లో ఒక ఎకరం కొనుగోలు చేసినప్పటికీ, అదే సర్వే నంబర్లోని మిగిలిన భూములకు బదిలీ కాకుండా నిషేధం విధించబడిందని మాజీ ఎమ్మెల్యే వివరించారు. ఈ నిషేధాన్ని తొలగించి, గ్రామ సభలు నిర్వహించాలని మీరు, గౌరవ ఇంచార్జి మంత్రి, కలెక్టర్ గారికి సూచించినట్లు తెలిపారు.
దీనిలో భాగంగా కలెక్టర్ ఆదేశాలతో గ్రామ సభలు నిర్వహిస్తున్నారని, ఈ విషయంలో త్వరగా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మంత్రిని కోరారు.












