రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బోనస్ ఇచ్చే పార్టీ కాదని, బోగస్ చేసే పార్టీ అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విమర్శించారు. వ తేదీన నిర్మల్ పట్టణంలో 50 వేల మందితో నిర్వహించబోయే యువ గర్జన బహిరంగ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని తెలిపారు.
నిర్మల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ ఇంచార్జి రాంకిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడారు. ప్రతీ పల్లె, పట్టణం కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నాయని, అందుకోసమే ఈ యువ గర్జన సభను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
యువత తరలిరావాలి
ప్రతీ గ్రామం నుంచి యువత భారీ ఎత్తున సభకు తరలిరావాలని ఆయన కోరారు. వ తేదీన భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో యువత చేరికలు ఉంటాయని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి రాంకిషన్ రెడ్డి, ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి భూక్య జాన్సన్ నాయక్, పట్టణ అధ్యక్షులు రాము, రాజేందర్ లతో పాటు ఆయా వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.











